మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆక్సిజన్ లీక్.. ఊపిరి అందక 11 మంది పేషెంట్ల మృతి..!

నాసిక్ జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో మృతుల సంఖ్య 22కు చేరింది. వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు ఒక్కొక్కరుగా ప్రాణాలొదిలారు. మహారాష్ట్ర నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ హాస్పిటల్‌లో ఆక్సీజన్ ప్లాంట్ లీక్ అయింది. దీంతో రోగులకు సప్లై అవుతున్న ప్రాణవాయువు ఒక్కసారిగా నిలిచిపోయింది. మొదటి అరగంటలోనే 11 మంది చనిపోయారు.
సకాలంలో ఆక్సీజన్ అందించలేకపోవడంతో మరో 11 మంది ప్రాణాలు వదిలారు. ఆస్పత్రిలో ఆక్సీజన్ లీక్ కావడంతో అందులో చికిత్స పొందుతున్న 31మంది రోగులను ఇతర ఆస్పత్రికి తరలించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సీజన్ సప్లైపై 150మంది రోగులు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి ఆస్పత్రి వర్గాలు.
కరోనా పేషెంట్లు వరుసగా చనిపోతుండడంతో జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆర్తనాదాలు మిన్నంటాయి. హాస్పిటల్‌లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లను తరలించలేక, ఆక్సిజన్ అందించలేక.. దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. కరోనా బాధితులకు తోడుగా వచ్చిన బంధువులైతే.. తమ వారు చనిపోవడాన్ని చూస్తుండడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
నాసిక్‌లో జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. సాంకేతిక లోపం కారణంగా జరిగిందా, సిబ్బంది నిర్లక్ష్యమా అన్నది విచారణలో తేలుతుందని మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ ప్రకటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com