National: పుస్తకాన్ని విడుదల చేస్తే దేశ ప్రజాస్వామ్యంలో భూకంపం వస్తుంది

రాజస్ఘాన్ స్వతంత్ర ఎమ్మెల్యే ఖుష్వీర్ సింగ్ జోజావార్ హాట్ కామెంట్స్‌చేశారు. రాజస్థాన్‌లో జరిగిన రాజకీయ సంక్షోభంపై ఆయన ఓ పుస్తకాన్ని రాశారు. అందులో అనేక సంచనాలవిషయాలు ఉన్నాయని తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా ఆయన ఆ పుస్తకాన్ని చూపుతూ దీన్ని విడుదల చేసే రోజు దేశ ప్రజాస్వామ్యంలో భూకంపం వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాజకీయాల్లో జరిగిన సంక్షోభానికి నేనే సాక్షి, నేనే దోషి. ఇందులో నేనే సాక్షిని, దోషిని. అందుకే ఈ పుస్తకంలో నేను సత్యాన్ని రాశానన్నారు.
మరోవైపు తాను 1967లో ఎమ్మెల్యేగా ఉన్నానని. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని అన్నారు.గత నాలుగేళ్లలో జరిగిన సంఘటనలు కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని అన్నారు ఖుష్వీర్ సింగ్ జోజావార్. ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన పరిణామాలపై జోజావార్ రాసిన పుస్తకంపై ప్రస్తుతం రాజస్థాన్‌లో చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com