National: కొంగతో స్నేహం..ఆశ్చర్యపోయిన అఖిలేష్ యాదవ్

X
By - Subba Reddy |6 March 2023 10:30 AM IST
ఉత్తర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి కొంగతో స్నేహం చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది
ఉత్తర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి కొంగతో స్నేహం చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. దీంతో.. వీరి స్నేహాన్ని చూసేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్వయంగా మండకా గ్రామానికి వెళ్లారు. కొన్ని నెలల క్రితం తన పొలంలో గాయపడిన ఓ భారీ కొంగను.. ఆరిఫ్ ఖాన్ గుర్జర్ కాపాడారు. అప్పటి నుంచి ఆ కొంగ అతణ్ని విడిచి వెళ్లడం లేదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ మండకా గ్రామానికి వెళ్లి.. ఆరిఫ్‌ఖాన్‌ను కలిశారు. కొంగతో కొనసాగుతున్న స్నేహాన్ని చూశారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com