National: వివాదాస్పదంగా బీజేపీ నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీలు

National: వివాదాస్పదంగా బీజేపీ నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీలు
మహిళా బాడీబిల్డర్లు క్రీడల పేరుతో హనుమంతుడిని అవమానించారని కాంగ్రెస్ కార్యకర్తల ఆరోపణ

మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో బీజేపీ నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీలు వివాదాస్పదంగా మారింది. మహిళా బాడీబిల్డర్లు క్రీడల పేరుతో హనుమంతుడిని అవమానించారని ఆరోపించారు. అంతే కాదు పోటీలు జరిగిన వేదికపై కాంగ్రెస్ కార్యకర్తలు గంగాజలం చల్లి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న మహిళా బాడీబిల్డర్లు హనుమంతుడి ఫొటో ముందు పోజులు ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కేడర్ హనుమాన్ చాలీసా' పఠించారు.

ఇక ఈ కార్యక్రయాన్ని రత్లాం బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్, ఎమ్మెల్యే చైతన్య కశ్యప్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ ఈవెంట్‌లో మహిళా బాడీబిల్డర్లు పోజులివ్వడం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్ సీరియస్‌ అయింది. ప్రహ్లాద్ పటేల్, కశ్యప్ లు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మనుమంతుడిని ముందు కుప్పిగంతులను వేసిన వారిని తప్పక శిక్షిస్తాడని అన్నారు.

అయితే బీజేపీ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. మహిళలు క్రీడల్లో రాణించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదంటున్నారు.కాంగ్రెస్‌వారు మహిళలు రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్ లేదా స్విమ్మింగ్‌లో పాల్గొంటున్నట్లు చూడలేరు, ఎందుకంటే వారిలోని దెయ్యం దీనిని చూసి మేల్కొంటుందని సెటైర్లు వేస్తున్నారు. క్రీడల్లో మహిళలను వక్రదృష్టితో చూడటం దారుణమని మండిపడుతున్నారు బీజేపీ నాయకులు.

అయితే ఇది హిందువులను, హనుమంతుడిని అగౌరవపరిచిందని.. అశ్లీలతకు మద్దతిచ్చినందుకు సీఎం వరాజ్ సింగ్ చౌహాన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు మధ్య ప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, మీడియా సలహాదారు పీయూష్ బాబెలే.

Tags

Next Story