National : "వాణిజ్యాన్ని పాకిస్థాన్ వద్దనుకుంది, భారత్ కాదు"

National : వాణిజ్యాన్ని పాకిస్థాన్ వద్దనుకుంది, భారత్ కాదు
రాజకీయం, వాణిజ్యం ఒకటి కాదని డబ్బు దాని భాషలో అది మాట్లాడుతుందని చెప్పారు


భారత్, పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలను తాము నిలువరించలేదని భారతీయ దౌత్యవేత్త అన్నట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. లాహోర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (LCCI)లో శుక్రవారం భారత డిప్యూటీ హైకమిషనర్ సురేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది.

పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం...పాక్ తో భారత్ సాధారణ సంబంధాలను కొనసాగించేందుకు అభ్యంతరం లేదని సురేష్ కుమార్ తెలిపారు. పాక్ తో వాణిజ్య ఒప్పందాలను భారత్ మానుకోలేదని ఆ నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వమే తీసుకుందని చెప్పారు. 2019లో జమ్యూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసుకుందని కుమార్ గుర్తుచేసినట్లు తెలిపింది.


కోవిడ్ మహమ్మారి సమయంలో పాకిస్థానీలకు భారత వీసాలు తగ్గించిన విషయం నిజమేనని తెలిపారు కుమార్. ఇప్పటికీ ప్రతీ సంవత్సరం 30వేల వీసాలను భారత్ జారీచేస్తున్నట్లు కుమార్ గుర్తుచేశారు. మెడికల్, స్పోర్ట్స్ వీసాలు కూడా జారీ అవుతున్నాయని చెప్పారు. రాజకీయం, వాణిజ్యం ఒకటి కాదని డబ్బు దాని భాషలో అది మాట్లాడుతుందని చెప్పారు. భారత దేశం రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించబోతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story