National : రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళల వివరాలను ఇవ్వాలని మార్చి 16 రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు రాహుల్ సమాదానం ఇవ్వకపోవడంతో ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు.
భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారని అన్నారు. సదరు మహిళల వివరాలను ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీకి నోటీసులు పంపించారు. నిందితులపై చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు రాహుల్ సహకరించాలని కోరారు.
రాహుల్ పై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు పోలీసులకు ఎలాంటి అధికారం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ ప్రకటన చేసి ఉండవచ్చని, బాధితుల పేర్లను వెళ్లడించమని బలవంతం చేయలేరని తెలిపారు. రాహుల్ గాంధీ వివరాలు ఇవ్వకపోతే మరో నోటీసు ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com