National: కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా

National: కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా
X
కర్ణాటకలోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది ఈసీ. కర్నాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటకలోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక ప్రాంతాలు అతిపెద్దవి.

ఇక, ఎన్నికల వేళ కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార బీజేపీతో సహా కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు ఎన్నికల కోసం ప్లాన్స్‌ రచిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల బరిలోకి దిగుతున్న కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 80 మంది అభ్యర్థుల పేర్లను ఈ నెల 20న ప్రకటించింది. మొత్తం 224 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్టు పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి బరిలోకి దిగుతుండగా, ఆ పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Tags

Next Story