National: ఎంపీ ఫైజల్ అనర్హతను ఉపసంహరించుకున్న లోక్‌సభ

అటు లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ అనర్హతను లోక్‌సభ ఉపసంహరించుకుంది.. ఇవాళ సుప్రీంకోర్టులో ఫైజల్ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో అనర్హత ఉపసంహరణ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.. హత్య కేసులో ఫైజల్‌కు కింది కోర్టు పదేళ్ల శిక్ష విధించడంతో లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది.. కింది కోర్టు తీర్పుపై కేరళ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.. హైకోర్టు స్టే ఇచ్చినా తన అనర్హతను లోక్‌సభ ఉపసంహరించుకోవడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. ఫైజల్ పిటిషన్‌ను ఈరోజు విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.. అయితే, కేరళ హైకోర్టు తీర్పు ఆధారంగా అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు ఇవాళ లోక్‌సభ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.. ఈ విషయంలో న్యాయస్థానాలు వ్యవహరించే తీరును బట్టి లోక్‌సభ సెక్రటేరియట్ ముందుకెళ్తామని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com