National: ప్రజాస్వామ్యానికి సంకెళ్లు: నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

National: ప్రజాస్వామ్యానికి సంకెళ్లు: నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ
X

ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందంటూ హాట్‌ కామెంట్‌ చేశారు కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ. పటియాలా సెంట్రల్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. 1988 నాటి గుర్‌నామ్‌ సింగ్‌ హత్య కేసులో దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు ఆయనకు ఏడాది కఠిన కారాగార శిక్షను విధించింది. అయితే ఆయన సత్ప్రవర్తన కారణంగా మరో రెండు నెలల శిక్షాకాలం మిగిలి ఉండగానే సిద్ధూ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత దేశంలో ప్రజాస్వామ్యం సంకెళ్లలో బందీగా ఉందని, దర్యాప్తు సంస్థలు బానిసలుగా మారాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story