National : కుప్పకూలిన డ్రాప్‌టవర్ రైడ్ ... 11మందికి గాయాలు

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఒక ఫెయిర్‌లో డ్రాప్‌టవర్ రైడ్ సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వీల్ తిరగటం మొదలుపెట్టిన క్షణాల్లోనే ఎత్తైన ఊయల అకస్మాత్తుగా పడిపోయింది. పెద్ద శబ్ధంతో పాటు, అరుపులు వినపడ్డాయి. ఫెయిర్ లో క్యాప్చర్ చేసిన క్రాష్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రైడ్ తిరగటం మొదలుపెట్టిన క్షణాల తరువాత, ఎత్తైన ఊయల అకస్మాత్తుగా నేలపై పడిపోవడంతో అరుపులు వినబడ్డాయి.
వీల్ కుప్పకూలగా 11మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులకు సహాయం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైడ్ జరుగుతున్నప్పుడు కేబుల్ విరిగిపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడినవారందరినీ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేసినట్లు చెప్పారు. గత ఏడాది ఇదే తరహా ఘటన పంజాబ్‌లోని మొహాలీలో దసరా ఉత్సవంలో జరిగింది. ఎత్తైన స్వింగ్ కూలిపోవడంతో చిన్నారులతో సహా కనీసం 16 మంది గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com