National: 2047 కల్లా భారత్ లో ఇస్లామ్ పాలన....

భారత్ లో ఇస్లామ్ రాజ్యాన్ని స్థాపించేందుకు భారీ స్థాయిలో కుట్ర జరుగుతోందని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ ప్రకటించింది. ఈమేరకు దేశంలో నిషేధానికి గైరన పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ పావులు కదుపుతోందని వెల్లడించింది. ఇందుకుగానూ భారీ ఎత్తున ఆయుధ సమీకరణ జరుగుతోందని, విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తోందని మహా ఎటీఎంస్ స్పష్టం చేసింది. ఐదుగురు PFI సభ్యులను అరెస్ట్ చేసిన ATS(Anti Terrorism Squad) వారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్న సమయంలో ఈ వివరాలను వెల్లడించింది. మజర్ ఖాన్, సాధిక్ షేక్, మహమ్మద్ ఇక్బాల్ ఖాన్, మోమిన్ మిస్త్రీ, ఆశిఫ్ హుస్సేన్ అనే వ్యక్తులను గతేడాది దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఆరోపణలతో ATS అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 2న ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో "ఇండియా 2047- భారత్ లో ఇస్లామ్ రాజ్యం"("India 2047- towards rule of Islam in India") అనే పత్రాలను హస్తగతం చేసుకున్నట్లు ATS వెల్లడించింది. సీడ్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం భారత్ లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సభ్యులకు దిశానిర్దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
2047లో ఇస్లామ్ చేతికి రాజకీయ అధికారం రావాలన్నదే తమ కల అని, బ్రిటీష్ రాజ్ తమ దగ్గర నుంచి లాగేసుకున్నదాన్ని తిరిగి దక్కించుకోవడమే లక్ష్యమని పేర్కొని ఉంది. ఇందుకు గానూ దేశంలో ఇస్లామ్ సంతతి అభివృద్ధి కోసం దిశానిర్దేశాలతో కూడిన రోడ్ మ్యాప్ అవసరమని, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ పేరిట ఇప్పటికే దాన్ని రూపొందించినట్లు వెల్లడైంది. ఇందుకోసం ఇస్లామ్ కమ్యునిటీలో వారి మనోవేదన గురించి పదేపదే ప్రస్తావించాలని, ఒకవేళ వారికి మనోవేదనలేమీ లేకపోతే సృష్టించాలని డాక్యుమెంట్ లో పేర్కొని ఉందని ATS తెలిపింది. ఈ లక్ష్యం నెరవేరాలంటే తమ సంస్థలన్నీ కలసిగట్టుగా పనిచేయాలని, కొత్త సభ్యులను ఎంపిక చేసుకోవాలని ప్రతిన బూనుకున్నట్లు డాక్యుమెంట్లు వెల్లడించారు. మరోవైపు RSS( రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కేవలం హిందువులకు మాత్రమే అండగా నిలబడుతుందన్న వాదనలు సృష్టించి వారిలో వారికే తగువులు పెట్టి మత అలజడులు సృష్టించే కుట్రలు కోకొల్లలు డాక్యుమెంట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com