National: కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

National: కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం
ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు

కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం అవుతుంది. సాయంత్రం ప్లీనరి తీర్మానాల ముసాయిదాపై చర్చ చేపట్టనున్నారు. 25, 26 తేదీల్లో వాటిపై ప్లీనరీలో చర్చిస్తారు. ఒక్కొ రోజు మూడు తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తారు. ఆదివారం సాయంత్రం బహిరంగ సభతో సమావేశాలు ముగుస్తాయి.

వరుస ఓటములతో కుదేలై హిమాచల్ ప్రదేశ్‌ గెలుపుతో ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్‌..ఈ ఏడాది జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగించాలన్న సంకల్పంతో ఉంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరి నిర్వహించడం ద్వారా ఆ రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న మధ్యప్రదేశ్‌, తెలంగాణ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచడానికి సమాయత్తమవుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి..ఆ భరోసాతో 2024 ఎన్నికల్లో విజయం సాధించి..ఆ భరోసాతో 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో ఉంది.


భావసారూప్య పార్టీలతో జట్టు కట్టి 2024 ఎన్నికలను ఎదుర్కొనే మార్గసూచీపై ప్లీనరీలో మేదోమథనం చేయనున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులతో పాటు 15 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే నాయకత్వానికి లాంఛనంగా ఆమోదం తెలిపి..కొత్త వర్కింగ్ కమిటీ ఎంపికకు పచ్చజెండా ఊపనున్నారు. CWC సభ్యుల ఎంపిుకకు ఎన్నికలు నిర్వహించాలా..లేదా అనేది మొదటి రోజు సమావేశంలో నిర్ణయించనున్నారు. ఎన్నికలు అవసరం లేదని సీనియర్లు...ఉండాలని జూనియర్లు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారిగా 1997లో CWCకి ఎన్నికలు జరిగాయి.

ఈ ఏడాది 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం ఉన్న నిలబెట్టుకోవడం..లేని చోట అధికారంలోకి రావడం ఎలా అన్న అంశాలపై ప్లీనరీలో చర్చించి శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. పశ్చిమం నుంచి తూర్పుకు రాహుల్‌ మరోయాత్ర చేయడంపైనా చర్చించి...వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లడంపైనా వ్యూహాలు రచించనున్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆప్‌ జాతీయ పార్టీలుగా రూపాంతరం చెంది ఎన్నికలకు రెడీ అవుతున్న తరుణంలో కాంగ్రెస్‌కు గతంలో లేని సవాళ్లు ఎదురవుతున్నాయి.

Tags

Next Story