National : ప్రధాని ఆదేశాలతో రాహుల్ పై మమత విమర్శలు : అధీర్ రంజన్

ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే బెంగాల్ సీఎం మమత మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టను కించపరిచేందుకు మోదీ, మమత ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. మీడియాతో మాట్లాడిన చౌదరీ, ప్రధాని ఆదేశాల మేరకే రాహుల్ గాంధీపై మమత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. "మమత ED-CBI దాడుల నుంచి రక్షించుకోవాలని కోరుకుంటుంది, అందుకే కాంగ్రెస్‌కు, రాహుల్ కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది." అని ఆయన చెప్పారు.
ఆదివారం, ముర్షిదాబాద్ జిల్లాలో పార్టీ అంతర్గత సమావేశంలో పార్టీ కార్యకర్తలను మమత బెనర్జీ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీని "హీరో"గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. తద్వారా ప్రస్తుత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. UKలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు కార్యకలాపాలను నిలిపివేసారని అన్నారు. మోదీని ఎవరూ ప్రశ్నించకుండా రాహుల్ ని హీరోగా నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com