National : దోమలపై ఫిర్యాదు... అర్థరాత్రి కాయిల్ తెచ్చి ఇచ్చిన పోలీసులు

భార్యకు దోమలు కుడుతున్నాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 15 నిమిషాల తర్వాత పోలీసులు అతనికి దోమల కాయిల్ ను అందజేశారు. అదికూడా అర్ధరాత్రి 2.45 గంటలకు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ చందైసికి చెందిన అసద్ ఖాన్ భార్య హరిప్రకాష్ నర్సింగ్ హోంలో మంగళవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు రాత్రి 2.45 గంటలకు అతని భార్యా బిడ్డలకు దోమలు కుట్టసాగాయి. అప్పటికే ప్రసవ భాదను అనుభవించిన తల్లికి దోమలు మరింత బాధ పెట్టసాగాయి. వీరి కష్టాన్ని చూడలేని అసద్ ఖాన్ అర్ధరాత్రి చేసేదేమి లేక ఉత్తర ప్రదేశ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ దోమల నుంచి రక్షణ కోరాడు. అతను ట్వీట్ చేసిన 10-15 నిమిషాల్లోనే ఓ పోలీసు జీబు హాస్పిటల్ ముందు ఆగింది. అందులో నుంచి ఓ పోలీసు దిగి దోమల కాయిల్ ను తీసుకెళ్లి అసద్ కు ఇచ్చాడు.
మీడియాతో మాట్లాడిన అసద్... " నా భార్య, బిడ్డ హాస్పిటల్ లో ఉన్నారు. దోమలు విపరీతంగా కుడుతున్నాయి. అర్ధరాత్రి ఏం చేయాలో తెలియక పోలీసులకు నా భాదను ట్యాగ్ చేశాను. ఊహించనటువంటి రెస్పాన్స్ వచ్చింది. పోలీసులు తనకు దోమల కాయిల్ ను తీసుకొచ్చి ఇస్తారనుకోలేదు. వారికి కృతజ్ఞతలు" అని అన్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com