National : రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

National : రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది గుజరాత్ లోని సూరత్ కోర్టు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. ఇందుకుగాను రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30రోజుల పాటు బెయిల్ మంజూరు చేయడంతో పాటు, అప్పీల్ చేయడానికి అనుమతించింది. రాహుల్ కు మద్దతు తెలిపారు కాంగ్రెస్ నాయకులు, వివిధ ప్రాంతాలనుంచి సూరత్ కు చేరుకుని రాహుల్ గాంధీ... షేర్-ఎ- హిందుస్థాన్ (హిందుస్థాన్ సింహం) అని కీర్తించారు.


2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ దొంగలకు మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది అన్న ఆరోపణలపై పరువు నష్టం కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ ఇరుపక్షాలు తుది వాదనలు విన్నారు. నాలుగేళ్ల నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించారు.

Tags

Next Story