National: రికార్డ్‌ స్థాయిలో GST వసూళ్‌

National: రికార్డ్‌ స్థాయిలో GST వసూళ్‌
గతేడా ది మార్చి నెల వసూళ్లతో పోలిస్తే ఈ వసూళ్లలో 13శాతం వృద్ధి

GST వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మార్చి నెలలో 1.60లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడా ది మార్చి నెల వసూళ్లతో పోలిస్తే ఈ వసూళ్లలో 13శాతం వృద్ధి నమోదైంది. ఐజీఎస్టీ కింద 82వేల 907కోట్లు సమకూరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెస్సుల రూ పంలో 10వేల 355 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. జీఎస్టీ వసూళ్లు 1.4లక్షల కోట్లపైనే నమోదవ్వడం వరుసగా ఇది 12వ నెల. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 18.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంటే సగటున నెలకు 1.51లక్షల కోట్లు వసూలయ్యాయి. 2021-22తో పోలిస్తే ఈ వసూళ్లు 22శాతం ఎక్కువ అని ఆర్థిక శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story