మంచి లాయర్.. విడాకులు కోరిన జంటకు మళ్లీ వివాహం చేసి..

లాయర్ గారూ పెళ్లై రెండేళ్లయింది.. అస్సలు అర్థం చేసుకోడు.. అంతా తను చెప్పిందే వినాలంటాడు.. తను చెప్పినట్లే చేయాలంటాడు.. నావల్ల కాదండి అతడిని భరించడం అని భార్య.. అర్థం చేసుకోలేని భార్య నాకొద్దంటూ అతగాడూ.. ఇద్దరూ కలిసి కోర్టు కెక్కారు విడాకులు కావాలంటూ..
కటక్ JMFC రూరల్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ఒడిశాలో గత ఐదేళ్లుగా విడివిడిగా నివసిస్తున్న జంటను ఆదివారం కలిసింది. ఒడిశా చౌధ్వార్‌కు చెందిన ప్రమోదిని ప్రధాన్ 2015 లో పలాసోలా గ్రామానికి చెందిన గగన్ బిహారీ బిస్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, వారి వివాహం జరిగిన రెండు సంవత్సరాల తరువాత వారి మధ్య వైరుధ్యం పెరిగింది. దీంతో కలిసి కాపురం చేయడం కష్టమనుకున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
ప్రమోదిని 2017 లో కటక్ ఫ్యామిలీ కోర్టులో గృహ హింస (డివి) కేసు దాఖలు చేసింది. కటక్ JMFC రూరల్ కోర్టులో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఇందులో ప్రమోదిని, గగన్‌ల యొక్క కేసు విచారణ జరిగింది. విచారణ సమయంలో, న్యాయమూర్తులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరికీ సర్థి చెప్పారు. కాపురం అన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి. దానికి పరిష్కారం విడాకలే అంటే ఎలా.. ఏడాది వయసున్న పాపకు ఏం చెప్తారు.. ఏం నేర్పిస్తారు.. అని విడాకుల ఆలోచనకు స్వస్తి పలకాలని అన్నారు. అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలన్నారు. న్యాయవాదుల మాటలతో ఆలోచనలో పడిన ఆ జంట కలిసి జీవిస్తామని, కాపురం చక్కదిద్దుకుంటామని అన్నారు. దీంతో న్యాయవాదులు కోర్టు ఆవరణలోనే వారికి మరోసారి వివాహం జరిపించారు. విడిపోయిన అయిదు సంవత్సరాల తర్వాత వారిద్దరినీ కలిపారు.
మంచి లాయరే.. విడాకులిమ్మన్న జంటకు మళ్లీ వివాహం చేసి..న్యాయమూర్తులు ఎస్డీజేఎం విద్యుత్ కుమార్ మిశ్రా, జేఎంఎఫ్‌సీ రూరల్ మనోజ్ కుమార్ మహంతి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు స్వయం ప్రభ ఆచార్య, పిటిషనర్ల తరపున లాయర్లు తదితరులు విచారణ సందర్భంగా హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com