National Sports Awards 2021: 12 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు..

National Sports Awards 2021: రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. ఇటీవలి టోక్యో ఒలింపిక్స్ లో పతకాలతో సత్తా చాటిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ అవార్డులు అందజేశారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ఈ సారి ఏకంగా 12 మంది క్రీడాకారులకు అందజేశారు.
జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాతో పాటు రెజ్లర్ రవి కుమార్ , బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన అవనీ లేఖా, సుమిత్ ఆంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణానగరె, మంజిత్ నర్వాల్ తో పాటు హాకీలో కాంస్యం అందించిన శ్రీజేష్, మన్‌ప్రీత్ సింగ్ తో పాటు క్రికెటర్ మిథాలీరాజ్ లు రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు.
ఒలింపిక్స్ లో సుదీర్ఘ విరామం తర్వాత అత్యుత్తమ ప్రతిభతో కాంస్యం అందించిన భారత హాకీ జట్టు సభ్యులందరికీ అర్జు అవార్డులతో సత్కరించారు. అలాగే టీమిండియా ప్లేయర్ శిఖర్ ధావన్ కూడా అర్జున అవార్డును అందుకున్నారు. అలాగే పలువురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను రాష్ట్రపతి అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com