జాతీయం

Navjot Singh Sidhu : పీసీసీ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

Navjot Singh Sidhu : పంజాబ్‌ రాజకీయాల్లో మరో కీలక ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమవుతున్న నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ... పీసీసీ పదవికి రాజీనామా చేశారు.

Navjot Singh Sidhu : పీసీసీ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ
X

Navjot Singh Sidhu : పంజాబ్‌ రాజకీయాల్లో మరో కీలక ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమవుతున్న నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ... పీసీసీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియాకు పంపారు. అయితే తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానంటూ సిద్ధూ ప్రకటించారు. కొద్ది రోజులుగా సిద్ధూతో పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌కు తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి కోల్పోయిన అమరీందర్‌.. సిద్ధూపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కానివ్వబోనని ప్రకటించారు. మరోవైపు.. కాంగ్రెస్ నుంచి క్రమంగా దూరమవుతున్న అమరీందర్...‌ బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Next Story

RELATED STORIES