Navjot Singh Sidhu: మనసు మార్చుకున్న సిద్ధు.. రాజీనామా విషయంలో..

Navjot Singh Sidhu (tv5news.in)
Navjot Singh Sidhu: పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ వెనక్కి తగ్గారు. తన పీసీసీ పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమని.. మళ్లీ బాధ్యతలు చేపడతానన్నారు. అయితే కొత్త అడ్వకేట్ జనరల్, డీజీపీ నియామకం తర్వాతే తాను తిరిగి విధుల్లోకి వస్తానని సిద్దూ చెప్పారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. అయితే శాఖల కేటాయింపు అనంతరం సిద్దూ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ పంచాయితీ.. సోనియా, రాహుల్ గాంధీ వద్దకు వెళ్లింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సిద్దూ రాజీనామాను ఆమోదించలేదు. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిద్దూ వ్యవహారం ఇటు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ.. పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పులుగా మారుతున్నాయని హస్తం నేతలు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com