ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ భేటీ..!

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగింది. ''ప్రధానితో మోదీతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ అయ్యారు'' అంటూ పీఎంవో ట్వీట్ చేసింది.
మరోవైపు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూశ్ గోయల్ కూడా పవార్‌తో శుక్రవారం సంప్రదింపులు జరిపారు. ఈనెల 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు సజావుగా సాగడానికి అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవార్, మోదీ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
గతంలో కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్ధవ్ కూడా మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన తర్వాత మహా వికాస్ అగాఢీలో కాస్త కుదుపు ప్రారంభమైంది. ఆ తర్వాత మోదీ భేటీపై ఓ వివరణ కూడా ఇచ్చింది. తాజాగా మహావికాస్ అగాఢీలో భాగమైన ఎన్సీపీ అధినేత పవార్ కూడా మోదీతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలు మహారాష్ట్రలో హాట్‌టాఫిక్‌గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com