ఈసారైనా 'నీట్' లో సీటు వస్తుందో లేదో అని..

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నీట్) జరగడానికి ఒక రోజు ముందు ఆమె బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. మదురైకి చెందిన 18 ఏళ్ల బాలిక శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సుదీర్ఘ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ లో పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయం, సీటు రాకపోవడం గురించి ఆమె రాసింది.
సబ్ ఇన్‌స్పెక్టర్ మురుగ సుందరం కుమార్తె జ్యోతి దుర్గా నీట్ ప్రవేశ పరీక్ష గురించి గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతోంది. జ్యోతి గత సంవత్సరం కూడా నీట్ పరీక్ష రాసింది కానీ క్లియర్ చేయలేకపోయింది. దాంతో ఈ సంవత్సరం మళ్లీ ప్రయత్నించాలనుకుని కష్టపడి చదువుతోంది. కానీ ఓ పక్క భయం ఈసారి కూడా సీటు వస్తుందో రాదో అని ఇదే విషయంపై శుక్రవారం రాత్రి ఆమె తన తండ్రితో పరీక్ష గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలియజేసింది.
జ్యోతి పుస్తకంలో దొరికిన సుదీర్ఘ లేఖలో తమ కుటుంబాన్ని ఎవరూ నిందించవద్దని రాశారు. పరీక్షలో విఫలమవుతాననే భయం, సీటు రాదనే భయంతోనే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పారు. ఆమె పరీక్షలకు సిద్ధం కావడానికి అర్థరాత్రి వరకు చదవడం అలవాటు చేసుకుంది. ఆరోజు రాత్రి కూడా ఆమె పరీక్షలకు సిద్ధమవుతుందనే భావించారు కుటుంబ సభ్యులు.. కానీ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. శనివారం తెల్లవారుజామున తల్లిదండ్రులు ఆమెకు టీ ఇవ్వడానికి తలుపు తట్టారు.. ఎంతకీ తీయక పోయేసరికి అనుమానం వచ్చింది. లోపలి నుంచి లాక్ చేసి ఉందని కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జ్యోతి దుర్గా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. జ్యోతి దుర్గా తన లేఖలో తన కుటుంబం తనపై చాలా అంచనాలు పెట్టుకుందని "నాకు కాలేజీలో సీటు రాకపోతే మీ కృషి అంతా వృధా అవుతుంది" అని రాశారు. ఆమె తన సోదరుడు, తండ్రి, స్నేహితులు, బంధువుల గురించి కూడా సూసైడ్ నోట్ లో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com