Netaji Jayanti: నేతాజీ విలువలు ముందుకు తీసుకెళ్లాలి: అనితా బోస్

X
By - Subba Reddy |23 Jan 2023 2:00 PM IST
అలాగే బోస్ అస్థికలను భారతదేశానికి తిరిగి తీసుకురావాలి
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను అభిమానించే వారు రాజకీయంగా వ్యక్తిగతంగా ఆయన విలువలను ముందకు తీసుకెళ్లాలని నేతాజీ కుమార్తె అనితా బోస్ ఫాఫ్ తెలిపారు. బోస్ అస్థికలను భారతదేశానికి తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నేతాజీ అన్ని మతాలవారికి సమాన హక్కులతో కూడిన భారతదేశాన్ని, ప్రజలంతా శాంతియుతంగా కలిసి జీవించే లౌకిక రాజ్యాన్ని ఊహించారని చెప్పారు. 77 ఏళ్ల క్రితం విదేశాల్లో మరణించినా, ఆయన అస్థికలు కూడా లేకున్నా... భారతీయులు నేతాజీని మరిచిపోలేదని అనిత అన్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అందరూ నమ్ముతున్నప్పటికీ నేతాజీ మరణం మిస్టరీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com