Netaji Jayanti: నేతాజీకి మెడీ నివాళి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా సోమవారం ప్రధానీ నరేంద్ర మెడీ ఆయనకు నివాళులు అర్పించారు. నేతాజీ దేశం కోసం ఎనలేని త్యాగాన్ని చేశారని, వలస పాలనను తీవ్రంగా ప్రతిఘటించారని కొనియాడారు. ఈమేరకు మోడీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 2021లో నేతాజీ జయంతిని పరాక్రమ్ దివాస్ గా ప్రభుత్వం ప్రకటించింది.
అండమాన్ నికోబార్‌లో ఉన్న 21 పేరులేని దీవులకు పేరు పెట్టే కార్యక్రమానికి మోడీ వర్చువల్‌గా హాజరయ్యారు. నేషనల్ మెమోరియల్‌ను నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దీవిలో నిర్మించనున్నట్లు ఆ మెడల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రధానీ కార్యాయం వెల్లడించింది. 2018లో మోడీ అండమాన్ నికోబార్ వెళ్లినప్పుడూ ఆ దీవులకు సుభాష్ చంద్రబోస్ దీవులు అని పేరు పెట్టారు. నీల్ ద్వీపానికి అలాగే హావ్‌లాక్ ద్వీపానికి కూడా షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ అని నామకరణం చేశారు. మన దేశ సార్వభౌమాధికారం కోసం కష్ట పడ్డ వీరులందరికీ ఇది ఎప్పటికీ చెరిగి పోని నివాళి అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com