వ్యవసాయ చట్టాలను మళ్లీ సమర్థించిన ప్రధాని మోదీ

వ్యవసాయ చట్టాలను మళ్లీ సమర్థించిన ప్రధాని మోదీ
X

నూతన వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ మరోసారి సమర్థించారు. ప్రతిపక్షాలు కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మోదీ తెలిపారు. ప్రతిపక్షాలు తమ హయాంలో ఈ సంస్కరణలకు అనుకూలంగానే ఉన్నాయని.. కానీ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోయాయని పేర్కొన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తే అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టంచేవారు. గుజరాత్ లోని కచ్ లో జరిగిన ఓ బహిరంగసభలో రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపై మోదీ పైవిధంగా స్పందించారు.


Tags

Next Story