New Delhi: ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సోనియా గాంధీ
New Delhi

X
By - Chitralekha |4 Jan 2023 2:45 PM IST
ఇటీవలే భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న సోనియా గాంధీ; ఆసుపత్రిలో అడ్మిట్ అయిన యూపీఏ ఛైర్ పర్సెన్; రొటీన్ చెకప్ అంటోన్న సన్నిహిత వర్గాలు
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీ కార్యకర్తల్లోనూ, అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది.
అయితే సోనియా రొటీన్ చెక్ అప్ కోసమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని స్పష్టమైంది. జెనరల్ హెల్త్ చెక్ అప్ నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని మీడియా ముందుకు వచ్చిన సోనియా గాంధీ ఆ తరువాత మళ్లీ బయటకు రాలేదు. డిసెంబర్ 24న ఆమె భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com