వచ్చే నెల నుంచి మారనున్న గ్యాస్ బుకింగ్ రూల్స్

వచ్చే నెల నుంచి మారనున్న గ్యాస్ బుకింగ్ రూల్స్
X
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే నెల నుంచి ఈ మార్పులు తీసుకొస్తున్నాయి.

నవంబర్ 1 నుంచి సిలిండర్ హోమ్ డెలివరీ నిబంధనల్లో మార్పు చోటుచేసుకోనుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే నెల నుంచి ఈ మార్పులు తీసుకొస్తున్నాయి.

కన్స్యూమర్ హక్కులను కాపాడేందుకు, అలాగే గ్యాస్ సిలిండర్లలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ డెలివరీ సిస్టమ్ ఈ విధంగా ఉండనుంది. ఈ డెలివరీ వ్యవస్థకు డీఏసీ అని పేరు పెట్టారు. డీఏసీ అంటే డెలివరీ అథంటికేషన్ కోడ్ అని అర్థం.

ఇకపై బుక్ చేసిన వెంటనే సిలిండర్ వచ్చేయదు. సిలిండర్ బుక్ చేసిన తరువాత మీరు గ్యాస్ కంపెనీ వారికి ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు డీఏసీ మెసేజ్ వస్తుంది. డెలివరీ బాయ్‌కు ఈ కోడ్ చెప్పాలి. అప్పుడే మీకు సిలిండర్ డెలివరీ అవుతుంది. అంతవరకు కోడ్ మీ వద్దనే ఉంటుంది.

ఒకవేళ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు వారి మొబైల్ నెంబర్‌ను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్టర్ చేసుకోపోతే డెలివరీ బాయ్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లో ఒక యాప్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు అప్పటికప్పుడు మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. తర్వాత కోడ్ వస్తుంది.

మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చిన వారు లేదా అడ్రస్ తప్పుగా ఇచ్చిన వారు సిలిండర్ డెలివరీ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీరికి గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆగిపోవచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మొదటిగా 100 పట్టణాల్లో ఈ వ్యవస్థను అందుబాటలోకి తీసుకు వస్తున్నాయి. క్రమంగా ఇతర పట్టణాలకు విస్తరిస్తారు. అయితే ఈ కొత్త వ్యవస్థ వంట గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు వర్తించదు.

Tags

Next Story