ఇక ముక్కులోనే కరోనా ఖతం.. మందు రెడీ.. దేశంలో మూడో ఫేజ్ ట్రయల్స్.!

ఇక ముక్కులోనే కరోనా ఖతం.. మందు రెడీ.. దేశంలో మూడో ఫేజ్ ట్రయల్స్.!
Nasal Spray for Covid: కోరోనా ఇక గొంతుదాటి లోపలి పోలేదు. ముక్కులోనే కరోనాని కతం చేసి మందు తయారైంది.

Nasal Spray for Covid: కోరోనా ఇక గొంతుదాటి లోపలి పోలేదు. ముక్కులోనే కరోనాని కతం చేసి మందు తయారైంది. ప్రస్తుతం దేశంలో ఈ మందుకి సంబందించిన మూడో ఫేజ్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఏంటి ఆశ్చ్యర్యపోతున్నారా.. నిజమే కరోనా చికిత్సలో ఉపయోగపడే నాసల్ స్ప్రే త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానుంది. భారతీయ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ మరియు కెనడియన్ కంపెనీ సనోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ కలిసి ఈ నాసల్ స్ప్రేని తయారుచేస్తున్నాయి.

భారతదేశంతో పాటు, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, తైవాన్, నేపాల్, బ్రూనై, కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, శ్రీలంకతో సహా ఆసియాలోని అనేక దేశాలకు స్ప్రే సరఫరా చేయడానికి ఆ కంపెనీ ఒప్పందాలు చేసుకుంది. ఈ నాసల్ స్ప్రే అసియా దేశాలపై కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడంలో మెరుగ్గా పనిచేస్తుందని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దాన్హా తెలిపారు. ఈ మందుని వీలైనంత తొందరగా ఆసియ అంతట సరఫరా చేసేలా తమ కంపెనీ చెర్యలు తీస్కుంటుందని ఆయన చెప్పారు.

కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న సనోటైజ్ అనే బయోటెక్ కంపెనీ ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (NONS) ని అభివృద్ధి చేసింది. ఈ స్ప్రేని రోగులే స్వయంగా వారి ముక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముక్కులోనే వైరస్ యొక్క తీవ్రతని తగ్గించి ఉపిరితితులకి హాని కలగకుండా కాపాడుతుంది. కెనడాలో మరియు యూకే లో నిర్వహించిన ఈ నాసల్ స్ప్రే ట్రయల్స్ లో మంచి ఫలితాలు లబించాయి. 79 మంది వైరస్ సోకినా వారి పై ఈ మందుని ప్రయోగించగా.. 24 గంటల్లో 95%, 72 గంటల్లో 99% వైరస్ తీవ్రతని తగ్గించింది. కెనడాలో నిర్వహించిన ట్రయల్స్‌లో 7,000 మంది రోగులకి ఈ మందుని ఇవ్వగా వారిలో ఎవరికీ కరోనా తీవ్ర ప్రభావం చుపించలేదట.

ఇప్పటికే ఇజ్రాయెల్, న్యూజిలాండ్ వంటి దేశాలు కరోనా చికిత్స కోసం ఈ స్ప్రేని అధికారింకంగా ఆమోదించాయి. సనోటైజ్ CEO, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ "గిలి రేగెవ్" మాట్లాడుతూ, తాము భారతదేశంతో భాగస్వామ్యం కోసం చూస్తున్నామని.. ఈ నాసల్ స్ప్రే భారత్ లో కరోనా వైద్య పరికరంగా ఆమోదించబడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 4 నుంచి 5 వెయిల మందితో తాము నిర్వహించనున్న ఫేజ్ -3 ట్రయల్స్‌ భారత్ లో కూడా జరుగుతాయి అని "గిలి రేగెవ్" అన్నారు.

Tags

Next Story