అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ పేమెంట్‌లో డిస్కౌంట్లు..

కేంద్ర ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ కార్డ్స్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్స్)కు సంబంధించి పలుమార్పులు చేసింది. దీంతో డ్రైవింగ్ లైసెన్సులు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ బంక్‌ల వద్ద్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా లభించే డిస్కౌంట్లు ఉండవు. పెద్ద వ్యాపారాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ ట్యాక్స్‌ల తగ్గింపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా యూనిఫాం వెహికల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ (ఆర్సీ) డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయబడతాయి. కొత్తగా జారీ చేయబడిన డ్రైవింగ్ లైసెన్సులు మైక్రోచిప్‌ను కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్స్ ఉంటాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి పేపర్ లెస్ ఆర్సీలను చేయనున్నారు. కొత్త ఆర్సీకి యజమాని పేరు ముందు భాగంలో ఉంటుంది. వెనుకభాగంలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. మరోవైపు, అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ బంకుల వద్ద క్రెడిట్ కార్డు ఉపయోగించే చెల్లింపులకు డిస్కౌంట్స్ ఉండవు. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు చమురు రంగ కంపెనీలు క్రెడిట్/డెబిట్ కార్డ్స్, ఈ-వ్యాలెట్స్ పైన ఇప్పటివరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. ఇవన్నీ అక్టోబర్ 1వ తేదీ నుంచి ఉండవు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com