Odisha: పెళ్లై ఆరు నెలలు.. గాలిపటం రూపంలో మృత్యువు..

Odisha: పెళ్లై ఆరు నెలలు.. గాలిపటం రూపంలో మృత్యువు..
Odisha: కటక్ సమీప ప్రాంతంలో మాంజాతో మరణాలు సంభవించడంతో గాజుతో తయారు చేసిన మాంజాలు నిఫేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Odisha: జీవిత భాగస్వామి సహచర్యంలో గడిపి ఆరు నెలలు కూడా కాలేదు.. అంతలోనే విధికి కన్నుకుట్టింది.. గాలిపటం రూపంలో మృత్యువు అతడిని కబళించింది. కళ్లముందే జీవచ్చవంలా పడి ఉన్న భర్తను చూసి గుండెలవిసేలా రోదిస్తోంది భార్య. ఈ విషాద ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.

మృతుడు కటక్ జిల్లా భైర్‌పూర్ ప్రాంతానికి చెందిన జయంత్ సమల్‌గా గుర్తించారు. ఆదివారం సాయింత్రం 4 గంటలకు జయంత్ తన భార్యతో కలిసి బైక్‌పై అత్తవారింటికి వెళుతున్నాడు. జగత్‌పూర్‌లోని పీర్ బజార్ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు గాజు పూతతో తయారు చేసిన మాంజా అతడికి గొంతుకు బలంగా తాకింది.

దాంతో అతడికి తీవ్ర రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు.. పరిస్థితి విషమించడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అప్పటికే జయంత్ మృతి చెందినట్లు తెలిపారు. జయంత్‌ని బలితీసుకున్న మాంజా నిషేధించబడింది.. అయినా గాలిపటాల విక్రేత దాన్ని విక్రయించడం చట్ట విరుద్ధం.. అందుకే మృతుడి కుటుంబసభ్యులు దుకాణదారుడిపై జగత్‌పుర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఒరిస్సా హైకోర్టు మాంజా దారం (గాలిపటాలు ఎగురవేయడానికి ఉపయోగించే గాజు పూతతో కూడిన రంగు దారం) అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు, కటక్ సమీప ప్రాంతంలో మాంజా దారంతో కొన్ని మరణాలు సంభవించడంతో గాజుతో తయారు చేసిన మాంజాలు నిఫేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story