పెళ్లై పది రోజులు కూడా కాలేదు.. అంతలోనే..

పెళ్లై పది రోజులు కూడా కాలేదు.. అంతలోనే..
"వివాహం జరిగిన వెంటనే, అతడు అనారోగ్యానికి గురై

కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ జంటను విధి చిన్న చూపు చూసింది. పెళ్లైన పది రోజులకే అతడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. "వివాహం జరిగిన వెంటనే, అతడు అనారోగ్యానికి గురై డిసెంబర్ 4 న మరణించాడు."అనుమానంతో అతడి మరణానంతరం కోవిడ్ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. కానీ వారం రోజుల తరువాత వధువు, ఆమె బంధువులు అనారోగ్యానికి గురయ్యారు. వారందరికీ కోవిడ్ టెస్ట్ చేయగా "పరీక్షలో, వధువు, ఆమె అత్తగారు, బావమరిది సహా తొమ్మిది మంది కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది.

వారందరూ చికిత్స పొందుతున్నారు" అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్‌ నీతా కుల్‌శ్రేష్టా చెప్పారు. కోవిడ్ కోసం ఇతర వ్యక్తులను పరీక్షించడానికి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 3,673 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. అందులో 171 క్రియాశీల కేసులు ఉన్నాయని వారంతా చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, 67 మంది ఈ వ్యాధి కారణంగా మరణించారని ఆమె తెలిపారు.

Tags

Next Story