వేడుకలో విషాదం.. అప్పగింతలే ఆమెకు ఆఖరి క్షణాలు..!

వేడుకలో విషాదం.. అప్పగింతలే ఆమెకు ఆఖరి క్షణాలు..!
మురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్‌ అనే యువకుడితో గురువారం రాత్రి వివాహం జరగింది.

అప్పటివరకు ఎంతో ఆనందంగా సాగిన వివాహ వేడుకల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అప్పగింతల సమయంలో నవ వధువుకు వీడ్కోలే ఆఖరి క్షణాలుగా మిగిలాయి. ఈ విషాదకరమైన ఘటన ఒడిసా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే... మురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్‌ అనే యువకుడితో గురువారం రాత్రి వివాహం జరగింది.అయితే పెళ్ళి మరసటి రోజు.. నవ వధువును అత్తావారింటికి పంపేందుకు అప్పగింతల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఒక్కసారిగా నవ వధువు కుప్పకూలిపోయింది.. అయితే అందరూ ఆమె నీరసం వల్ల పడిపోయిందని అనుకున్నారు. వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్టుగా వైద్యులు వెల్లడించారు. అప్పగింతల్లో అతిగా ఏడ్వడం వల్ల గుండెపోటు వచ్చిందని... ఇదే అమె చావుకి కారణమని వైద్యులు తెలిపారు. పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు చనిపోవడంతో కుటుంబసభ్యులు సహా బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

Tags

Next Story