రైతులు పట్టు వీడలేదు..కేంద్రం మెట్టు దిగలేదు..ఎనిమిదో దశ చర్చలు కూడా విఫలం

రైతులు పట్టు వీడలేదు..కేంద్రం మెట్టు దిగలేదు..ఎనిమిదో దశ చర్చలు కూడా విఫలం
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు.

రైతు సంఘాలతో కేంద్రం జరిపిన ఎనిమిదో దశ చర్చలు కూడా విఫలమయ్యాయి. మరోసారి ఈనెల 15న చర్చలు జరుగనున్నాయి. రైతులు పట్టు వీడలేదు. కేంద్రం మెట్టు దిగలేదు. దీంతో చర్చల్లో పురోగతి కనిపించలేదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. కనీస మద్ధతు ధరకు సంబంధించి లిఖిత పూర్వక హామీని ఇవ్వాలని కూడా రైతులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Tags

Next Story