నవంబర్ 7 నుంచి 30 వరకు బాణసంచాపై బ్యాన్‌

నవంబర్ 7 నుంచి 30 వరకు బాణసంచాపై బ్యాన్‌

వెలుగులు విరజిమ్మే దీపావళి పండగ ఈసారి ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉంటుందా ఉండదా అనే ఉత్కంఠకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ తెరదించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న పరిస్థితుల్లో.. ఈ నెల 9 నుంచి 30 వరకు బాణసంచా కాల్చడంపై NGT నిషేధం విధించింది. నేషనల్ కేపిటల్ రీజియన్-ఢిల్లీ పరిధిలో వచ్చే రాష్ట్రాల్లోనూ నిషేధం కొనసాగుతుందని తెలిపింది.

వాయు కాలుష్యం ఓ మోస్తరుగా ఉన్న ప్రాంతాలు, రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిచ్చింది NGT. అదికూడా కేవలం 2 గంటలపాటు మాత్రమే కాల్చాలని NGT సూచించింది. ఇప్పటికే ఢిల్లీ సహా హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక వంటి రాష్ట్రాల్లో.. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. కరోనా, వాయుకాలుష్యం వంటి పరిస్థితుల్లో.. ఢిల్లీలో ఈ నెల 7 నుంచి 30 వరకు క్రాకర్స్ అమ్మకాలు, కాల్చడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీలో ఇప్పటికే క్రాకర్స్ షాపుల లైసెన్సులను పోలీసులు రద్దు చేశారు. ఢిల్లీలో కరోనా, వాయుకాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో NGTకి వచ్చిన ఓ పిటిషన్‌పై..తాజా నిర్ణయం తీసుకున్నారు.

Tags

Next Story