NIA RIDES : జమ్మూలో ఎన్ఐఏ సోదాలు

జమ్మూ-కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) దాడులు నిర్వహిస్తోంది. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా దేశంలో పలు రాష్ట్రాలలో ఇప్పటికే దాడులు ముమ్మరం చేసింది. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గామ్, పుల్వామా, అనంత్‌నాగ్ మరియు షోపియాన్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. తీవ్రవాదులకు స్లీపర్ సెల్స్ గా వ్యవహరిస్తున్న వారితో పాటు, భారత్ లో ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతున్న వారిని ఏరివేస్తుంది. అందులో భాగంగా కుల్గామ్, పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్‌లలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై హురియత్ నేత ఖాజీ యాసిర్, జమ్మూకశ్మీర్ సాల్వేషన్ మూవ్‌మెంట్ చైర్మన్ జాఫర్ భట్ ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో దాడులను నిర్వహించిన ఎప్ఐఏ పలువురిని అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి మందుగుండు సామాగ్రిని స్వాదీనం చేసుకుంది. సదరు నిందితులు ఐసిస్ కు పనిచేస్తున్నట్లు తెలిపింది ఎన్ఐఏ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com