NIA searches: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న NIA సోదాలు

NIA searches: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పీఎఫ్‌ఐ ఆఫీసులపై ఎన్‌ఐఏ సోదాలు ముమ్మరం చేసింది. యూపీ, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక సహా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో వేకువజాము నుంచే పీఎఫ్‌ఐ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. సుమారు 40 ప్రదేశాల్లో చేపట్టిన తనిఖీల్లో ఈడీ, ఎన్‌ఐఏ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అటు పీఎఫ్ఐపై దాడుల్లో స్థానిక పోలీసులు భాగమైనట్లు తెలిపారు.....
అటు టెర్రర్ ఫండింగ్, శిక్షణా శిబిరాలు ఏర్పాటు, ఉగ్రసంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం వంటి ఆరోపణలపై 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. దాడుల్లో 200కు పైగా ఎన్ఐఏ అధికారు పాల్గొన్నారు. మరోవైపు మళప్పురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ పార్టీ ఛైర్మన్ ఒమా సలాం ఇంటితో సహా పలువురు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. ఎన్‌ఐఏ సోదాల సందర్భంగా పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. తమిళనాడులోని మధురై, దిండిగుల్, రామనాథపురం, కడలూరు, టెంకాసీ ప్రాంతాల్లో పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తల ఆస్తులపై బుధవారం రాత్రి నుంచే ఎన్ఐఏ దాడులు చేపట్టంది...
ఇప్పటి వరకు ఇవే అతిపెద్ద దాడులని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు నిర్వహించడం, నిషేధిత సంస్థలలో చేరడానికి వ్యక్తులను ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో సోదాలు జరుగుతున్నాయని ఎన్‌ఐఏ వెల్లడించింది. హైదరాబాద్ పాత బస్తీలోని చాంద్రాయణగుట్టలో PFI హైదరాబాద్ కార్యాలయాన్ని సీజ్ చేశారు NIA అధికారులు తెల్లవారుజామున సోదాలు నిర్వహించిన అధికారులు హార్డ్‌డిస్క్‌లు,పెన్‌డ్రైవ్‌లు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.విచారణకు హాజరు కావాలని PFI సభ్యులకు నోటీసులు జారీ చేశారు NIA అధికారులు.
తెలుగురాష్ట్రాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు కొనసాగుతున్నాయి.PFI సంస్థపై తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే NIA సోదాలు చేస్తుంది. హైదరాబాద్,గుంటూరు,కరీంనగర్‌లలో సోదాలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్‌లోని ఉప్పల్,ఘట్కేసర్ ప్రాంతాల్లో ఉన్న PFI సంస్థల కార్యకర్తల ఇళ్లలో NIA అధికారులు సోదాలు చేస్తున్నారు..అటు గుంటూరు ఆటోనగర్‌లోనూ సోదాలు జరిగాయి..ఇటు కరీంనగర్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు NIA అధికారులు..
మరోవైపు కర్నూలు నగరంలో NIA అధికారులు ఆర్ధరాత్రి నుంచి పాతబస్తీలో సోదాలు చేపట్టారు..రెండు ట్రక్‌లలో స్పెషల్ బెటాలియన్ పోలీసుల భారీ సెక్యూరిటితో SDPI నాయకుల ఇంట్లో సోదాలు నిర్వహించారు.కర్నూలు పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో NIA సోదాలు కొనసాగాయి.. ఈ సోదాలకు వ్యతిరేకంగా SDPI కార్యకర్తలు నినాదాలు చేశారు.. దేశ వ్యాప్తంగా వందమందికి పైగా ఉగ్ర లింక్‌లు ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసింది NIA.
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 40 చోట్ల సోదాలు చేసిన NIA
సోదాల్లో పాల్గొన్న 200 ఎన్ఐఏ అధికారులు
దేశవ్యాప్తంగా 106 అరెస్ట్ చేసిన NIA అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న NIA సోదాలు
హైదరాబాద్,గుంటూరు,కరీంనగర్‌లో సోదాలు
కర్నూలు పాతబస్తీలో NIA సోదాలు
SDPI నాయకుల ఇంట్లో సోదాలు నిర్వహించిన NIA
NIA సోదాలకు వ్యతిరేకంగా SDPI కార్యకర్తల నినాదాలు
హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలోని..
PFI హైదరాబాద్ కార్యాలయాన్ని సీజ్
హార్డ్‌డిస్క్‌లు,పెన్‌డ్రైవ్‌లు కీలక పత్రాలను స్వాధీనం
విచారణకు హాజరు కావాలని PFI సభ్యులకు..
నోటీసులు జారీ చేశారు NIA అధికారులు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com