శ్రీమతి నిహారిక ఫస్ట్ బర్త్‌డే పార్టీ.. చైతన్య క్యూట్ విషెస్..

శ్రీమతి నిహారిక ఫస్ట్ బర్త్‌డే పార్టీ.. చైతన్య క్యూట్ విషెస్..
ఇందుకోసం కొత్త జంట ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు..

సెలబ్రెటీల పెళ్లి, పుట్టిన రోజు అన్నీ వార్తలే.. ఇక నటీనటులైతే చెప్పనక్కరలేదు. అభిమానులకు కూడా వాళ్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి. మెగా డాటర్ నిహారిక డిసెంబర్ 9 ను పెళ్లి చేసుకుంది. ఈ రోజు డిసెంబర్ 18న 28వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభతరుణంలో శ్రీమతిగా మారిన నిహారిక పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా చేయాలని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో తన భార్యకు చైతన్య ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్' అంటూ పొద్దుతిరుగుడు పూవుతో పోల్చాడు. సూర్య కిరణాలు పడితేనే ఆ పువ్వు వికసిస్తుంది. అలానే నిహా తన జీవితంలోకి అడుగుపెట్టడంతో తన జీవితం కూడా వికసించిందనే అర్థం వచ్చేలా చైతన్య వివరించిన తీరు నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది.

కాగా నిహారిక పుట్టిన రోజు వేడుకలను ఫలక్‌నూమా ప్యాలెస్‌లో జరిపేందుకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొత్త జంట ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక గత రాత్రి నాగబాబు బుల్లితెర షో 'అదిరింది' కమెడియన్స్ అందరితో కలిసి సందడి చేశారు.

Tags

Next Story