అప్పుడు జాన్వీ కపూర్.. ఇప్పుడు నిహారిక..

అప్పుడు జాన్వీ కపూర్.. ఇప్పుడు నిహారిక..
X
శుక్రవారం రాత్రి రిసెప్షన్ జరిగింది.

నటుడు నాగబాబు కూతురు నిహారిక పెళ్లి కుటుంబసభ్యులు కొద్ది మంది అతిధుల మధ్య ఉదయపూర్‌లో జరిపి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ శుక్రవారం రాత్రి రిసెప్షన్ జరిగింది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురితో పాటు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు. కాగా, రిసెప్షన్‌లో నిహారిక ధరించిన భారీ బ్రైడల్ లెహంగా ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించారు.



లైట్ గ్రీన్, గోల్డ్ కలర్‌లో ఉన్న ఈ లెహంగాలో నిహారిక మెరిసి పోయారు. అందంగా ముస్తాబైన ఆమె బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌ని గుర్తుకుతెచ్చింది. మనీశ్ మల్హాత్రా డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్‌కు జాన్వీకపూర్ మోడలింగ్ చేసింది. అందులో నిహారిక రిసెప్షన్‌కు వేసుకున్న లెహంగాను జాన్వీ ధరించి ఓ ప్రకటనలో మెరిసింది. అప్పట్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా నిహారిక అవే దుస్తుల్లో కనిపించడంతో ఇద్దరు ఈ దుస్తుల్లో ఎంతందంగా ఉన్నారో అని కామెంట్లు పెడతున్నారు. మరికొంత మంది జాన్వీకపూర్‌ని నిహారిక ఫాలో అయిందని అంటున్నారు.

Next Story