నీరవ్ మోదీని భారత్ కు అప్పగించాలని యూకే కోర్టు తీర్పు..!

నీరవ్ మోదీని భారత్ కు అప్పగించాలని యూకే కోర్టు తీర్పు..!
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు 14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు 14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. భారత్‌కు అప్పగించినా నీరవ్‌కు అన్యాయం జరగదని పేర్కొంది. అలాగే నీరవ్‌ మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కోర్టు కొట్టి పారేసింది. ఆర్థర్ రోడ్‌ జైలులో నీరవ్ మోదీకి సరైన వైద్య చికిత్స.. మానసిక చికిత్స ఇస్తారని యూకే కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌కు 14వేల కోట్లు ఎగ్గొట్టిన‌ కేసులో నీర‌వ్ మోదీపై ఇవాళ లండ‌న్ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఆ కేసులో నీర‌వ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నట్లు న్యాయ‌మూర్తి తెలిపారు. పీఎన్‌బీ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో నీర‌వ్ మోదీని భార‌త్‌కు అప్పగించాలని జ‌డ్జి సామ్యూల్ త‌న తీర్పులో ఆదేశించారు. వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ కేసు రెండున్నరేళ్లుగా యూకే కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. మోసం, మ‌నీల్యాండ‌రింగ్ కింద అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వాండ్స్‌వ‌ర్త్ జైలు నుంచి నీరవ్‌ మోదీ ఇవాళ వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. డిస్ట్రిక్ జ‌డ్జి సామ్యూల్ గూజీ ఈ కేసులో తీర్పును వెలువ‌రించారు. అయితే మ‌నీల్యాండ‌రింగ్ కేసులో నీర‌వ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ఆ జ‌డ్జి తెలిపారు. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును యూకే హోంశాఖ మంత్రి ప్రీతిపాటిల్‌కు తెలియ‌జేయ‌నున్నారు.

పీఎన్‌బీకి కోట్లు ఎగ‌వేసిన కేసులో నీర‌వ్‌ను అప్పగించాలని బ్రిట‌న్‌ను భార‌త్ కోరుతూ వస్తోంది. ఒక‌వేళ నీర‌వ్‌ను భార‌త్‌కు అప్పగిస్తే, అక్కడ ఆయ‌న‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌న్న దాంట్లో వాస్తవం లేద‌ని కూడా కోర్టు అభిప్రాయ‌ప‌డింది. నీర‌వ్‌కు వ్యతిరేకంగా భార‌త్ త‌మ‌కు 16 సంపుటాల ఆధారాల‌ను స‌మ‌ర్పించింద‌ని, భార‌త ప్రభుత్వం స‌మ‌ర్పించిన ఆధారాల‌ను గుర్తిస్తున్నట్లు జ‌డ్జి వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story