Nirav Modi.. రా..రా సామీ రారా! నీరవ్ బెండు తీసేందుకు ఏర్పాట్లు రెడీ!

Nirav Modi.. రా..రా సామీ రారా! నీరవ్ బెండు తీసేందుకు ఏర్పాట్లు రెడీ!
Nirav Modi..అబ్బబ్బ లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడు మనోడు జోరు నెవ్వరు బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టరూ అన్నట్లుగా సాగింది.

Nirav Modi..మోసాల మతలబులకి హమేషా మనమే తానీషా అన్నట్లుగా బ్యాంకులకు ఇలా కూడా టోపీ పెట్టొచ్చా అని జనం నోరెళ్లబెట్టేలా చేసినవాళ్లలో అగ్రగణ్యులు విజయ్ మాల్యా అయితే అతగాడి కరప్షన్ సియామీ ట్విన్ నీరవ్ మోడీ..అబ్బబ్బ లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడు మనోడు జోరు నెవ్వరు బిఫోర్..ఎవ్వర్ ఆఫ్టరూ అన్నట్లుగా సాగింది. ఆ హీరోయిన్లతో ర్యాంప్ వాక్‌లేంది, ఆ మోడళ్లతో సరాగమాడుతున్నట్లు ఫోటో షూట్‌లేంది ఒకటి కాదు ఈ ఇద్దరి యవ్వారాలు, ఐతే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయన్నట్లుగా ఈ ఇద్దరూ లండన్‌లో తేలారు. ఒకళ్లని ఆరేళ్ల నుంచి భారత్ రప్పించేందుకు ప్రయత్నిస్తుంటే, ఇంకొకరిని రెండేళ్ల నుంచి జుట్టు పట్టుకుని లాక్కొచ్చే ప్రయత్నం చేస్తోంది భారత్. అందులో ఈ జిత్తులమారి పొట్టోడు నీరవ్ మోడీని ఇక భారత్‌కి తీసుకెళ్లొచ్చంటూ లండన్ కోర్టు పర్మిషనివ్వడంతో మనోడి పని దాదాపు అయిపోయినట్లే అనుకోవాలి..ఇదే వెస్ట్‌మినిస్టర్ కోర్టులోనే విజయ్ మాల్యా కేసు కూడా విచారణ జరుగుతోంది.

మోసం చేయడం ఒక ఎత్తు..ఆ తర్వాత దేశాంతరం పోవడం మరొక ఎత్తు. ఈ రెండు ఎపిసోడ్‌లలో నీరవ్ మోడీదే పై చేయి కాగా, అతని ఆటకి క్లైమాక్స్ మాత్రం మన సిబిఐ, ఈడీ అధికారులే ఇవ్వడం హైలైట్. విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉండటం వీళ్లకి ప్లస్ పాయింట్ కాగా, నీరవ్ మోడీ మరో అడుగు ముందుకేసి అక్కడే ఓ షాప్ అద్దెకి తీసుకుని మరీ కొత్త వ్యాపారం నడిపాడు. ఎవడూ గుర్తుపట్టకుండా వేషం మార్చేయడం ఈ ఊసరవెల్లికి వెన్నతో పెట్టిన విద్య. అలానే తన వేషం మార్చుకుని గడ్డం, మీసం పెంచుకున్నాడు..ఐతే లోకల్‌గా తిరిగేవాళ్లెవరూ మన మీడియాకి లీక్ ఇవ్వడంతో గత ఏడాది పట్టుబడ్డాడు. అదిగో అప్పట్నుంచి నీరవ్ మోదీ ఆస్తులను ఇక్కడ మన దేశంలో జప్తు చేయడం భవంతులు కూల్చేయడం, కోర్టులు నోటీసులపై నోటీసులు జారీ చేస్తుండగా..ఇప్పటికి ఓ లాజికల్ కంక్లూజన్ దొరికినట్లే..ఐతే చివరిలో కూడా నీరవ్ మోడీ వేసిన ఎత్తులు చూస్తే..ఇంత నీచమా అన్పించకమానదు.. భారత్‌లో న్యాయం దొరకదట..భారత్‌లో వైద్యసహాయం సరైనది అందదట..ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా..? వాండ్స్ వర్త్ జైల్లో ఈకలు పీకిందిక చాలు దయచేయి బాబూ ఇండియాలో జైల్లో అసలు ట్రీట్‌మెంట్ నీకు రెడీగా ఉందంటూ రేపు ఇండియాకి రాగానే మనోడి మక్కెలు విరగదీసి బొక్కలో నెట్టేందుకు సిబిఐ ఈడీ ముంబై ఆర్థూర్ జైలులో ఓ స్పెషల్ బ్యారెక్ సిద్ధం చేస్తున్నారట

డైమండ్ మర్చంట్‌గా బ్యాంకులకు పరిచయమై వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని ముంచేయడంలో నీరవ్ మోడీ అనుసరించిన పద్దతి ఓ గుణపాఠం లాంటిది. లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్‌ని అడ్డం పెట్టుకుని, తప్పుడు పద్దతుల్లో రుణాలు తీసుకోవడం, పైగా వాటిని కోర్ బ్యాంకింగ్ కన్ను గప్పి మరీ విదేశాల్లోని ఇతర బ్రాంచుల నుంచి భారీగా సొమ్ము దక్కించుకోవడం బ్యాంకింగ్ వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపేవి. పైగా ఆర్బీఐ అధికారులు ప్రతి బ్యాంక్‌లో ప్రతి మూడు నెలలకోసారి ఆడిటింగ్ చేయాల్సి ఉండగా..అక్కడా ఈ ప్రొసీజరల్ ల్యాప్స్ బయటపడకపోవడ ఆర్బీఐ సిబ్బంది నిర్వాకాన్ని కూడా ఎత్తి చూపేదే. ఇంటి దొంగల సాయంతోనే ఇది చేశారంటూ పిఎన్‌బిలో జరిగిన స్కాంకు సంబంధించి కొంతమంది బ్యాంక్ సిబ్బందిపై కూడా వేటు పడింది.

మార్చి 19,2019న లండన్‌లో నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు అప్పట్నుంచి అక్కడ విచారణ సాగుతోంది. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. ఈ తీర్పును అమలు చేయాల్సిందిగా కోర్టు యూకే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ప్రీతి పటేల్‌కి పంపుతారు. ఆమె మేగ్జిమమ్ తీర్పును అడ్డుకోరు. సాధారణంగా కోర్టు తీర్పులను ఏ మరణశిక్ష వంటి అరుదైన కేసుల్లో మాత్రమే మినిస్టర్ అభ్యంతరం పెట్టడం ఉంటుంది. నీరవ్ మోడీ కేసులో అలాంటి పప్పులేం ఉడకవ్. ఇక చిట్టచివరిగా నీరవ్ మోడీకి 14రోజులు హైకోర్టుకి అప్పీల్ చేసుకునేందుకు వీలు ఉంది. అక్కడేదైనా ఊరట దక్కితే,అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఆప్ హైకోర్టులో తిరిగి విచారణ జరుగుతుంది. సో..ఇంకో పద్నాలుగు రోజుల్లోపే నీరవ్ మోడీ అనే కిలాడీ మోసగాడు భారత్‌కి రావడం ఖాయం.

Also watch : Profit Your Trade

Tags

Read MoreRead Less
Next Story