'నిశ్చయ్' పెళ్లిలో మెరిసిన తారలు.. అదిరేటి డ్రెస్సులు, ఆభరణాలు.. ఎంతో తెలుసా!!

పక్కింట్లో వాళ్ల పెళ్లంటేనే పట్టుచీరలు కొనేస్తున్నారు. ఇక ఇంట్లో వాళ్ల పెళ్లికి ఆ మాత్రం హడావిడి లేకపోతే ఎలా.. అందునా సెలబ్రెటీలు.. అందరి చూపులు వారిపైనే ఉంటాయి. వారు ధరించే దుస్తులు, ఆభరణాలు.. అబ్బో ఒకటేమిటి అన్నీ అదిరిపోతున్నాయి.. రేటు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.. ఎంతుంటుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. నిశ్చయ్ వివాహ వేడుకల్లో సందడి చేసిన స్నేహ, ఉపాసన, సుస్మిత, లావణ్య త్రిపాఠి ధరించిన దుస్తులు, యాక్ససరీస్ గురించి ఓ లుక్కేద్దాం..
ఐదు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకల్లో అతిధులను ఆకట్టుకునే ఆభరణాలు, దుస్తులు ధరించి సందడి చేశారు. చిరంజీవి కుమార్తెలు ధరించిన దుస్తులు, బ్యాగులు నెటిజన్లను, అటు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇక బన్నీ సతీమణి స్నేహారెడ్డి ఉదయ్‌పూర్‌కు బయల్దేరే ముందు వేసుకున్న యాష్ కలర్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్.. అనితా దొంగ్రే డిజైన్ చేశారు. ఈ డ్రెస్ ధర దాదాపు రూ.12,900. అదే రోజు ధరించిన దియోర్ (DIOR) శాడల్ బ్యాగ్ ధర రూ.2,47,620 ఉంటుందని అంచనా. సంగీత్‌లో స్నేహ వేసుకున్న డ్రెస్ ధర రూ.4,35,000 ఉంటుందట. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ దీన్ని డిజైన్ చేశారు.
ఇక చెర్రీ భార్య ఉపాసన సింపుల్‌గా పింక్ ఫ్రాక్ ధరించినా.. హెర్మస్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్ ధర భారీగానే ఉంది.. ఈ బ్యాగ్ ధర రూ.11,73,171 ఉంటుందని నెటిజన్ల టాక్. సంగీత్‌లో తరుణ్ తహిలియానీ, పెళ్లి వేడుకల్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులు ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు. వీటి ధరల కూడా లక్షల్లోనే ఉంటుందట. నిశ్చయ్ పెళ్లిలో లావణ్య త్రిపాఠి నీలిరంగు చీరలో మెరిశారు. ప్రముఖ డిజైన్ మనీశ్ మల్హాత్రా డిజైన్ చేసిన ఈ చీర ధర రూ.1,35,000 ఉంటుందని అంచనా.
ఇక విహహ వేడుక పూర్తయిన మరుసటి రోజు ఉదయ్ విలాస్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత క్రీమ్ కలర్ శారీ ధరించారు. ఈ చీర చూడ్డానికి సింపుల్‌గా ఉన్నా సభ్యసాచి బ్రాండ్‌కు చెందిన ఈ చీర ధర రూ.85 వేలు. వీళ్లు ధరించినవే ఇంత రేటు ఉంటే ఇంక పెళ్లి కూతురు నిహారిక ధరించిన దుస్తులు, ఆభరణాల గురించి చెప్పక్కర్లేదేమో. వాటి గురించి ఇంకా బయటకు రాలేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com