నిహారిక-చైతన్య.. నిశ్చయ్‌గా మారిపోతున్న వేళ.. కుటుంబ సభ్యుల ఆనందాల హేల.. వీడియో వైరల్

నిహారిక-చైతన్య.. నిశ్చయ్‌గా మారిపోతున్న వేళ.. కుటుంబ సభ్యుల ఆనందాల హేల.. వీడియో వైరల్
X
ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

నిహారికను పెళ్లి కుమార్తెను చేసిన వీడియోను నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. నిహారికకు మంగళ స్నానం చేయించడం, ఆమెను అలంకరించడం, కుటుంబసభ్యులు ఆశీర్వదించడం తదితర ఘట్టాలు ఈ వీడియోలో ఉన్నాయి. అనంతరం వధూవరులు అందరితో కలిసి ఉత్సాహంగా కోలాటం ఆడారు. కుటుంబసభ్యుల కోలాహలంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య నిహారిక మెడలో మూడు ముళ్లు వేస్తారు. ముచ్చటైన ఈ జంటను వీక్షించేందుకు అతిధులు తరలి వెళుతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో మూడు రోజుల నుంచి నిహా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబసభ్యులంతా సోమవారం స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయపూర్ చేరుకున్నారు. సోమవారం రాత్రి సంగీత్, మంగళవారం సాయింత్రం మెహందీ వేడుకలు ఆద్యంతం అభిమానులను ఆకట్టుకున్నాయి.

Tags

Next Story