Nisha Dahiya: నిషా దహియా మరణ వార్తలపై పోలీసుల క్లారిటీ.. ఇద్దరు వేర్వేరు అంటూ..

Nisha Dahiya (tv5news.in)
Nisha Dahiya: సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఎప్పుడూ పూర్తిస్థాయిలో నమ్మకూడదని మరోసారి నిరూపణ అయ్యింది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నిషా దహియా చనిపోయిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. హర్యానాలోని సోనిపట్‌లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీలో రెజ్లర్ నిషా దహియా మరియు ఆమె సోదరుడు సూరజ్ ని కొంతమంది దుండగులు కాల్చి చంపారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా తన అభిమానులు ఉలిక్కిపడ్డారు.
తాజాగా తన మరణ వార్తలపై స్పందించింది నిషా దహియా. తాను చనిపోలేదని, ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నానని పేర్కొంది. దీంతో ఈ వార్తలకు చెక్ పడింది. అయితే నిషా దహియా ఇచ్చిన స్టేట్‌మెంట్ తర్వాత పోలీసులు కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
చనిపోయిన నిషా దహియా, రెస్లర్ నిషా దహియా వేర్వేరని వారు స్పష్టం చేశారు. రెస్లర్ నిషా ప్రస్తుతం ఒక ఈవెంట్ కోసం పానిపట్ వెళ్లిందని వారు తెలిపారు. దీని బట్టి సోషల్ మీడియాపై పూర్తిగా ఆధారపడకూడదని మరోసారి స్పష్టమయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com