మద్యం మత్తులో మగువ..

మద్యం మత్తులో మగువ..
X
సగం మందికి పైగా మహిళలు మద్యానికి బానిసైనట్లు అధికారుల సర్వేలో తేలింది.

ఇంటిని ఇల్లాలే చక్కదిద్దాలి. ఆయన తాగొస్తే గొడవ చేసి పెద్దల సమక్షంలో నాలుగు చీవాట్లు పెట్టించి కాపురాన్ని చక్కదిద్దుకుంటుంది. ఇన్ని చేసే ఇల్లాలే తాగితే ఆ ఇల్లు, ఆమె ఒళ్లు గుల్ల అవడంతో పాటు కుటుంబం బజారుపాలవుతుంది.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ నిజాలు వెలుగు చూశాయి. నిజామాబాద్ జిల్లాలో నివస్తున్న సగం మందికి పైగా మహిళలు మద్యానికి బానిసైనట్లు అధికారుల సర్వేలో తేలింది.

మద్యం సేవించే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 6.7 శాతం ఉండగా, ఈ ఒక్క జిల్లాలోనే 3.1 శాతం అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణ ప్రాంతాల్లోనే మగువలకు మద్యం తీసుకునే అలవాటు ఉన్నట్లు తేలింది.

గత ఏడాది 2019 జూన్ 30నుంచి నవంబర్ 14 వరకు సర్వే బృందం ఇంటింటికీ తిరిగి సేకరించిన వివరాల ఆధారంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పురుషుల విషయానికి వస్తే రాష్ట్రంలో 43.3 శాతం మంది మందు బాబులు ఉండగా.. జిల్లాలో 40.02 శాతం ఉన్నట్లు సర్వే పేర్కొంది.

పొగాకు వినియోగంలోనూ మహిళ ముందంజలోనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వినియోగించే మహిళల శాతం 5.6 శాతం కాగా, జిల్లాలో 8.6 శాతం పొగాకు ఆధారిత ఉత్పత్తులకు అలవాటు పడినట్లు సర్వే తెలిపింది. పురుషుల విషయానికి వస్తే తంబాకు, గుట్కా, సిగరెట్లు గుప్పున పీల్చే వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 22.3 శాతం ఉంటే జిల్లాలో 20.6 శాతం ఉన్నట్లు తేలింది.

Tags

Next Story