Delhi: నో నాన్‌వెజ్.. ఓన్లీ వెజ్..: యూనివర్శిటీ కొత్త రూల్

Delhi: నో నాన్‌వెజ్.. ఓన్లీ వెజ్..: యూనివర్శిటీ కొత్త రూల్
Delhi: కోవిడ్ మహమ్మారి తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాల క్యాంటీన్ లేదా హాస్టల్‌లోని విద్యార్థులకు మాంసాహార ఆహారాన్ని అందించడం ఆపివేసింది.

Delhi: కోవిడ్ మహమ్మారి తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాల క్యాంటీన్ లేదా హాస్టల్‌లోని విద్యార్థులకు మాంసాహార ఆహారాన్ని అందించడం ఆపివేసింది. ఇది నాన్ వెజ్ ప్రియులకు మింగుడు పడని విషయంగా మారింది.




ఈ చర్య దక్షిణ భారత విద్యార్థులకు ఇబ్బందులను సృష్టిస్తోందని అన్నారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభయ్‌ మౌర్య మాట్లాడుతూ.. గతంలో నాన్‌ వెజ్‌ ఫుడ్‌ అందజేసేవారని, అయితే ఒక్కసారిగా నాన్‌ వెజ్‌ ఫుడ్‌, గుడ్లను నిలిపివేశారని.. దక్షిణాది నుంచి వచ్చిన విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది. నాన్ వెజ్ ఫుడ్ తినాలనుకునే విద్యార్థులకు నాన్ వెజ్ ఫుడ్ ఇవ్వాలని నేను కోరుతున్నాను"



కాగా శాకాహారం తీసుకునే వారికి నాన్ వెజ్ ఫుడ్ అందిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని మూడో సంవత్సరం విద్యార్థి చెప్పాడు. మాంసాహారం తినే వ్యక్తులు శాఖాహారం కూడా తినవచ్చు, కానీ శాఖాహారులు శాఖాహారం మాత్రమే తింటారు అని మరికొందరు విద్యార్ధులు అంటున్నారు. విశ్వవిద్యాలయం చర్యను కొందరు విద్యార్థులు స్వాగతిస్తే మరికొందరు తప్పుపడుతున్నారు.


కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమ మాట్లాడుతూ కోవిడ్ మా జీవనశైలిని మార్చింది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని మేము భావించాము" అని అన్నారు. ఆహారం కోసం హాస్టల్ కమిటీ నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులతో తప్పనిసరిగా మాట్లాడాలని ఆమె అన్నారు. మెజారిటీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే మేనేజ్‌మెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు.


"నాన్-వెజ్ ఫుడ్ అందిస్తామనే హామీతో మేము విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వలేదు. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌కు కొన్ని నియమాలు ఉన్నాయి" అని ఆమె తెలిపారు. నాన్ వెజ్ ఫుడ్ తినాలనుకునే విద్యార్థులు బయట తినవచ్చని, ఎలాంటి పరిమితి లేదని ప్రొఫెసర్ రమ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story