నాలుగు నెలల వరకు లగ్గాల్లేవు..

నిన్న మొన్నటి వరకు కరోనా సీజన్.. ఇప్పడేమో శుభ గడియల్లేవంటూ ముహుర్తం వాయిదా. దాదాపు మూడు నెలల పాటు ముహుర్తాలు లేవంటున్నారు పండితులు. కొత్త సంవత్సరం మొదటి వారం నుంచే శుభ గడియల కాలం ముగిసిందంటున్నారు.
జనవరి 8 నుంచి మే 14 వరకు పెళ్లి బాజాలు ల్లేవు, కళ్యాణ కాంతుల్లేవు. జనవరి 7తో మంచి ముహుర్తం ముగుస్తుంది. సంక్రాంతి తర్వాత వచ్చే రోజుల్ని పీడ దినాలుగా భావిస్తూ శుభకార్యాలు నిర్వహించరు. జనవరి 14 పుష్య శుద్ద పాడ్యమి నుంచి ఫిబ్రవరి 12 వరకు శూన్యమాసం కొనసాగనుంది.
మే 4 తర్వాత పది రోజుల పాటు శుభ దినాలున్నా బలమైన ముహుర్తాలు లేవు. మళ్లీ జూలై 4 నుంచి ఆషాఢమాసం మొదలై ఆగస్టు 11 వరకు ఉంటుంది. అప్పుడు కూడా శుభముహూర్తాలు ఉండవు. ఇలా 2021లో ముహూర్తాలు కొరత ఏర్పడనుంది.
శుభ ముహూర్తాలకు ఇన్ని రోజు విరామం రావడానికి గురు, శుక్ర మౌఢ్యమిలు కలిసి రావటమే కారణమని, ఆ సమయంలో శుభకార్యాలకు దూరంగా ఉండడమే మంచిదని ప్రముఖ పౌరాణికులు పేర్కొంటున్నారు. ఇలా రెండు మూఢాలు కలిసి రావడం అరుదుగా సంభవిస్తుంది. అయితే శాస్త్ర ప్రకారం చెడు చేసే కాలంగా భావించాల్సిన అవసరం లేదని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com