Car Vandalism: ఉద్యోగం నుంచి తొలగించారని.. 14 కార్లపై యాసిడ్ పోసి..

Noida: కోపంతో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడో అర్థం కాదు.. ఉద్యోగం నుంచి తొలగించారని ఆగ్రహంతో ఊగిపోయాడు.. 14 కార్లపై యాసిడ్ పోసి తన కోపం చల్లార్చుకోవాలనుకున్నాడు. నోయిడా వ్యక్తి వాషింగ్ ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత 14 కార్లను యాసిడ్ పోసి ధ్వంసం చేశాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది.
బుధవారం ఉదయం 9:15 గంటల ప్రాంతంలో నిందితుడు కార్లు, ఎస్‌యూవీలను ధ్వంసం చేయడం కనిపించింది. పార్కింగ్ స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా దెబ్బతిన్న వాహనాల యజమానులు ఈ సంఘటన గురించి తెలుసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటనకు సంబంధించిన వ్యక్తి తన ఉద్యోగం నుండి తొలగించినందుకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యంతో అతను అనేక కార్లపై యాసిడ్ పోసి ధ్వంసం చేస్తూ విధ్వంసానికి దిగాడు. నోయిడాలోని సెక్టార్ 75లోని మాక్స్‌బ్లిస్ వైట్ హౌస్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితుడు రామరాజ్ సొసైటీలో కార్ క్లీనర్‌గా పనిచేశాడు. అయితే అతడి పనిలో నాణ్యత కొరవడిందని అతడిని ఉద్యోగంలో నుంచి తీసేసారు. దాంతో అతడు బుధవారం సొసైటీకి చేరుకుని, దాదాపు డజను కార్లపై యాసిడ్ పోసి ధ్వంసం చేశాడు. సుమారు 25 ఏళ్లున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నోయిడా పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అతనిపై IPC సెక్షన్ 427 కింద కేసు నమోదు చేయబడింది. అతని అరెస్టు తరువాత అతన్ని స్థానిక కోర్టుకు, ఆపై అతన్ని జైలుకు పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com