Normal Monsoon In 2023: వర్షాలు బాగానే పడే అవకాశం...

Normal Monsoon In 2023: వర్షాలు బాగానే పడే అవకాశం...
వర్షాలపై ఆశాభావం వ్యక్తం చేసిన వాతావరణ శాఖ; బాగానే పడే అవకాశం ఉందంటోన్న అధికారులు
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2023లో నైరుతి రుతుపవనాల ప్రభావం సమృద్ధిగానే ఉండబోతోందని వాతావరణ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎన్ నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ మొదటివారంలోని వాతావరణ మార్పులను బట్టీ వర్షాకాల గమనాన్ని అంచనా వేసిన ఐఎండీ, వర్షాలు బాగానే పడే అవకాశం ఉన్నప్పటికీ ఎన్ నినో కారణంగా మార్పులు సంభవించే ఆస్కారం ఉందని స్పష్టం చేశారు. ఈక్వెటోరియల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల వాతావరణం వేడెక్కడం ద్వారా ఏడేళ్లకు ఒకసారి ఇలాంటి వాతావరణ మార్పులు సంభవించే ఆస్కారం ఉందని తెలుస్తోంది. దీనివల్ల ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story