Norovirus : కేరళలో కొత్త వైరస్... ఇప్పటికే 13మందికి సోకిన వైరస్.. లక్షణాలివే..!

Norovirus : కేరళలో కొత్తరకం వైరస్ బయటపడింది. దీనిని నోరో వైరస్ గా అక్కడి వైద్యులు గుర్తించారు. ఇప్పటికే అక్కడ 13మందికి ఈ వైరస్ సోకడంతో రాష్ట్రప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇది అంటువ్యాధని అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. త్రాగునీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించింది. అయితే ఈ వైరస్ సోకిన వారు చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కాగా కేరళలో రెండు వారల వ్యవధిలో 13మందికి ఈ వైరస్ సోకగా వీరందరూ వయనాడ్ జిల్లాలో ఓ పశువైద్య కళాశాల విద్యార్ధులని సమాచారం. దీనిపైన అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్. ప్రస్తుతానికి దీనిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సూపర్ క్లోరినేషన్‌తో సహా అన్నీ చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, సరైన నివారణ మరియు చికిత్సతో, వ్యాధిని త్వరగా నయం చేయవచ్చని మంత్రి తెలిపారు.
నోరోవైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించిన మార్గదర్శకాలను ఆమె విడుదల చేశారు. మార్గదర్శకాల ప్రకారం.. వ్యాధి సోకిన వ్యక్తులు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి మరియు ORS ద్రావణం మరియు ఉడికించిన నీరు త్రాగాలి. తినే ముందు మరియు మూత్రవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో బాగా కడగాలి. పండ్లు మరియు కూరగాయలు పూర్తిగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి.
ఈ వైరస్ కి సంబంధించిన లక్షణాలు ఈ విధంగా ఉంటాయని US శాస్త్రవేత్తలు అంటున్నారు.
నోరోవైరస్ యొక్క లక్షణాలు : అతిసారం, కడుపు నొప్పి, వాంతులు, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు
కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వలన వైరస్ సోకిన వారి నుంచి నోరో వ్యాపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com