ఇది ఇల్లు కొనడానికి సరైన సమయమేనా.. !!

ఇది ఇల్లు కొనడానికి సరైన సమయమేనా.. !!
ఇల్లు కొనే ప్లాన్ ఎప్పటిదో కాబట్టి కాస్తో కూస్తో సేవింగ్స్ చేసిన డబ్బు బ్యాంకులో అలా భద్రంగా ఉంది..

ఇంట్లో ఖరీదైన వస్తువులన్నీ వున్నాయి.. ఇల్లు మాత్రం లేదు.. అద్దెలు బాగానే చెబుతున్నారు.. అదేదో లోన్ కట్టుకోవచ్చని ఇల్లు కొందామంటే ధైర్యం చాలడం లేదు.. కొవిడ్ వచ్చి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.. బాస్ మంచివారు కాబట్టి ఉద్యోగం ఉంది.. చాలా ఆఫీసుల్లో కనీసం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఈ పాండమిక్ సమయంలో ఉద్యోగాల్లో నుంచి పీకేస్తున్నారట.. ఇల్లు కొనే ప్లాన్ ఎప్పటిదో కాబట్టి కాస్తో కూస్తో సేవింగ్స్ చేసిన డబ్బు బ్యాంకులో అలా భద్రంగా ఉంది.. ఆ ధైర్యంతోనే ఇంటి వేట ప్రారంభిస్తున్నారు నగర వాసులు కరోనా కష్టకాలంలో కూడా.

మీ బడ్జెట్ లోనే మీరు కోరుకున్న ఇల్లు మీ సొంతమవుతుంది అనే ప్రకటనలు వినిపిస్తుంటాయి. రాబోయే రోజుల్లో నగరాలు కోవిడ్ నుంచి కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటాయి. అప్పటికల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగానే పుంజుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇల్లు కొనే ఆలోచన ఉన్నవారిలో 50 శాతం కంటే ఎక్కువ మంది రాబోయే ఆరు నెలల్లో తమ కలల గృహం సొంతం చేసుకునే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి వంటి పలు అంశాలపై వీరి నిర్ణయం ఆధారపడి ఉన్నప్పటికీ ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయమని అంటున్నారు నిర్మాణదారులు. ఇల్లు కొనాలనుకునే వారికి కొన్ని కలిసొచ్చే అంశాలను కూడా వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అందుబాటులో ఇళ్ల ధరలు, తక్కువ గృహరుణ వడ్డీరేట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రుణ ఆధారిత వడ్డీరేట్ల సబ్సిడీ పథకం కొనుగోలుదారులకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

ఇక ఇల్లు కొనడానికి మొగ్గు చూపే వారిలో ఎక్కువగా 35 ఏళ్లు పైబడిన వారే కనిపిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఆరునెలల్లో ఇల్లు కొందామని ప్లాన్ చేసుకుంటున్నారు. వీరికి స్థిరమైన ఆదాయం ఉండడం ప్రధాన కారణం. 50 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నవారు, 35 శాతం మంది ఉద్యోగులు తమ బడ్జెట్ లో వచ్చే బృందావనం గురించి ఎంక్వైరీ చేస్తున్న వారిలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story